telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లోకేష్ పరమ వెస్ట్.. పార్టీ నడపడం రాదు..ట్రాక్టర్ కూడా : కొడాలి నాని

kodali nani ycp

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ గురించి మాట్లాడడం పరమ వెస్ట్ అని…దొంగలు పడిన ఆరు నెలలకు మొరుగుతున్నారని ఫైర్ అయ్యారు కొడాలి నాని. వరదలు ఎప్పుడు వచ్చాయి..ఎప్పుడు పంటలను పరిశీలిస్తున్నారని లోకేష్ పై మండిపడ్డారు. లోకేష్ హాఫ్ నాలెడ్జ్..పార్టీ నడపడం రాదు..అంతే కాదు ట్రాక్టర్ కూడా నడపడం రాదని సెటైర్ వేశారు కొడాలి నాని. లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో అదే విధంగా తెలుగుదేశం పార్టీని కూడా దించుతాడని ఎద్దేవా చేశారు. బుద్ది ఉన్నోళ్లు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుంచి..పార్టీ నుంచి లోకేష్ గురించి మాట్లాడటం పరమ వెస్ట్ అని పేర్కొన్నారు. కాగా..ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నారా లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తూ.. కొందరిని ట్రాక్టర్ ఎక్కించుకుని నిర్లక్ష్యంగా వారి ప్రాణాలకు హాని కలిగించేలా అక్కడున్న రోడ్లపై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినందుకు గాను నారా లోకేష్ పై పోలీస్ కేసు నమోదైంది. కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించి నందుకు ఆకివీడు పోలీసులు నారాలోకేష్ పై కేసు నమోదు చేశారు.

Related posts