telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు ఒరిగేదేమీ లేదు: కోదండరాం

Kodandaram

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు.

భూమి అమ్మకం, కొనుగోలుకు మాత్రమే కొత్త చట్టం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు దక్కాలనేదే తమ డిమాండని చెప్పారు. అవినీతి అంతానికి కర్ణాటక తరహా లోకాయుక్తాను తీసుకురావాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెవ్‌సైట్‌లో లోపాలున్నాయని ఆయన అన్నారు.

Related posts