telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వీఆర్వోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి జగదీష్‌రెడ్డి

jagadish reddy trs

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి. వీఆర్వోలను ఏదైనా ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమానమైన శ్రేణిలోకి బదిలీ లేదా విలీనం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగా మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. వీఆర్వోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోరుకున్న శాఖకు బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్త రెవిన్యూ చట్టంతో భూసమస్యలన్నీ తొలగిపోతాయని ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పథకం ప్రకారం అభివృద్ధి పనుల కోసమే సీఎం కేసీఆర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారని చెప్పారు.

Related posts