టీం ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమయ్యాయి. మూడు టీ20 ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభ కానుంది. టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పొట్టి ఫార్మాట్ సిరీస్ సొంతం చేసుకోవాలని టీం ఇండియా పట్టుదలతో ఉండగా.. కోహ్లీ సేనపై పై చేయి సాధించి రేసులో దూసుకుపోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. తొలి టీ 20లో గెలిచిన ఇండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్‌కు ఆసీస్ ఫించ్ దూరమయ్యాడు. వేడ్ కెస్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు : మాథ్యూ వేడ్ {కెప్టెన్}, స్టీవ్ స్మిత్, హెన్రిక్స్, గ్లెన్ మాక్స్ వెల్, సీన్ అబోట్, ఆడం జంపా, డేనియల్ సామ్స్, షార్ట్, స్టాయినిస్, స్వెప్సన్, ఆండ్రూ టై,
ఇండియా జట్టు : విరాట్ కోహ్లి {కెప్టెన్}, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, చాహల్, శార్దూల్