telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోని తర్వాత చెన్నై కెప్టెన్ అతనే : వాన్

చెన్నై‌ జట్టులో ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మహీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీ మరో 2-3 ఏళ్లు ఆడొచ్చని, జడేజాను భవిష్యత్‌ కెప్టెన్‌గా భావిస్తూ చెన్నై సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలని వాన్‌ సీఎస్‌కే ఫ్రాంఛైజీకి సూచించాడు. ఇక ఐపీఎల్‌ 2021‌లో మెరుపు లాంటి ఫీల్డింగ్‌ విన్యాసాలతో అదరగొడుతున్న జడేజాను ‘అత్యుత్తమ ఫీల్డర్’‌ అంటూ వాన్‌ ఇప్పటికే కితాబిచ్చిన సంగతి తెలిసిందే. ‘బలమైన జట్టును రవీంద్ర జడేజా నిర్మిస్తాడు. అలాగే బ్యాట్‌, బంతి, ఫీల్డింగ్‌తో పాటు అతడి ఆలోచనా విధానం కూడా బాగుంటుంది. ఆటపై మంచి పరిజ్ఞానం కలిగిన ఆటగాడు జడేజా. అవసరాన్ని బట్టి ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగలడు, ఎప్పుడైనా బౌలింగ్ చేయగలడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆటతీరును బట్టి ఫీల్డింగ్‌లోనూ మార్పులు చేసుకోగల ఆటగాడు. అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు. జడేజా అంత మంచి క్రికెటర్‌’ అని మైకేల్‌ వాన్‌ ప్రశంసలు కురిపించాడు.

Related posts