జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలన పైన ఏర్పాటైన సమీక్ష సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి మాట్లా డుతూ ఈనెల 16న ప్రారంభించనున్న వార్డు కార్యాలయాలకు కార్పొరేటర్, శాసనసభ్యులను ,ఎమ్మెల్సీలను, మంత్రులను మేయర్ ,డిప్యూటీ మేయర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలన్నారు.
వార్డు కార్యాలయం ఉదయం 8:30 గంటలకు ప్రారంబించేల చర్యలు తీసుకోవాలన్నారు.
వార్డు కార్యాలయలను సుందరoగాతీర్చిదిద్దాలన్నారు. కార్యాలయాలకు ముందర టెంట్ , మైక్, షామియానా, అల్పహరం చర్యలు తీసుకోవాలని అన్నారు
జోనల్ కమిషనర్లకు జోనల్ పరిధిలోని వార్డు కార్యాలయాలకు ముఖ్య అతిథులు ఆహ్వానించడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి కొన్ని వార్డు కార్యాలయాలను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వార్డ్ కార్యాలయం ప్రారంభం అనంతరం జోనల్ కమిషనర్ లు ప్రతి వారము పర్యవేక్షించాలన్నారు.
సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ జీయాఉద్దిన్, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి ,రవి కిరణ్, మమత, పంకజ,సామ్రాట్ అశోక్ డెప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
ఏపీకి ఇప్పటికే 42 వేల కోట్ల అప్పులు: దేవినేని ఉమ