ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.86 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి. కానీ, ఇప్పుడు కేసులు వందకు దిగువగా నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 886608 కు చేరింది. ఇందులో 878837 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,168 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 66 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 32,434 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
next post