telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వార్డు కార్యాలయాలకు వచ్చిన సమస్యల సమన్వయం తో పరిష్కరించాలి – మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

నగరవాసులకు సుపరిపాలన అందించేందుకు ఈనెల 16వ తేదీన ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పారదర్శకంగా తమ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బంజారాహిల్స్ వార్డ్ కార్యాలయ సిబ్బంది అధికారులు సర్కిల్ అధికారులతో కలిసి మేయర్ ఏర్పాట్లపై సమీక్షించారు


ఈ సందర్భంగా మేయర్ అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సుపరిపాలన అందించాలని లక్ష్యంతో వార్డ్ కార్యాలను ఏర్పాటు చేయ నున్నందున వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు
సమస్యకు పరిష్కారానికి సిటిజన్ చార్జర్ రూపొందించి నందున ప్రతి సమస్య ను నిర్ణీత కాల వ్యవధి లో పరిష్కరించి జి హెచ్ ఏం సి లో బంజారా హిల్స్ వార్డు  ఆదర్శంగా నిలవాలి అన్నారు.
వార్డ్ కార్యాలయం పరిపాల అధికారి కీలక పాత్ర ఉందని అన్నారు మిగతా విభాగాల ఇంజనీర్, , టౌన్ ప్లానింగ్ పారిశుద్ధ్యం పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం జలమండలి యు బి డి విద్యుత్ శాఖ సిబ్బంది వార్డు కార్యాలయంలో నియమించినందున వారి వారి విభాగాలకు  సంభందించిన సమస్యలను వెంటనే పరిష్కరించి పిర్యాదు దారునికి సమాచారం అందించాలని ఆమె కోరారు
అయా విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ డిసి రజనీకాంత్ రెడ్డి ఏఎంసి తదితరులు పాల్గొన్నారు

Related posts