పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ రోజు ఉదయం కలకత్తాలో జరిగిన దాడిలో దాడిలో ఆయన వాహనం ధ్వంసమయింది. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ టీఎంసీ మద్దతుదారులే తనపై దాడి చేశారని ఆరోపించారు. తనను కాపాడేందుకు యత్నించిన తన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారని అన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందని ఆయన అన్నారు.
ఈ ఉదయం తమ పార్టీ కార్యకర్తలను కోచ్ పుకుర్ గ్రామంలోని ఓ టీ స్టాల్ వద్ద కలిసేందుకు వెళ్తుండగా టీఎంసీ కార్యకర్తలు తనను అడ్డుకున్నారని దిలీప్ ఘోష్ తెలిపారు. తనపై చేయి చేసుకున్నారని, తన సెక్యూరిటీ గార్డ్ పై కూడా దాడి చేశారని చెప్పారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చినప్పటికీ, వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.