రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా… ఆన్‌లైన్‌లో స్లాట్‌ల బుకింగ్‌లో సాంకేతిక ఇబ్బందులు, సర్వర్లు నెమ్మదిగా స్పందించడం వంటి సమస్యలతో ఇటు అధికారులు, అటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. జీపీఏ ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ కావడం లేదు. థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్లపైనా సందిగ్ధం నెలకొంది. ముందుగా స్లాట్‌లు బుక్ చేసుకున్న వాళ్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. అయితే మొత్తంగా రాష్ట్రంలో ఇవాళ 80 వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి… రిజిస్ట్రేషన్ల కోసం ఇవాళ మొత్తం 103 స్లాట్లు బుక్ అవగా, వివిధ కారణాల వల్ల 15 మంది రిజిస్ట్రేషన్ల కోసం రాలేదు.. రిజిస్ట్రేషన్ కు రాని 15 మందిలో స్లాట్ బుక్ చేసుకున్నా అమావాస్య కారణంగా ఐదుగురు ఆగిపోయారు.. ఇవాళ స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోనివాళ్లకు మరోరోజు స్లాట్ కేటాయించే వెసులుబాటు లేదని స్పష్టం చేసింది రిజిస్ట్రేషన్ల శాఖ.. ఆధార్ సంబంధిత సమాచారం ట్యాలీ కాకపోవడంతో మరికొన్ని లావాదేవీలు ఆగిపోయాయి.. స్టాంప్ డ్యూటీ ఇతరత్రా కలిపి ఇవాళ మొత్తంగా రూ. 32 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేసారు.
previous post
next post
హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు