telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోబెల్స్ ప్రచారంలో బిజెపికి నోబెల్ ఇవ్వాలి..

Harish Rao TRS

గోబెల్స్ ప్రచారంలో బిజెపికి నోబెల్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… లింగన్న ఆశయాలను సాధించడానికి సుజాతక్క మీ ముందుకు వచ్చింది. ఓట్లనంగానే కాంగ్రెసోడు, బిజెపొడు వచ్చిండు. వాళ్లు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు లో ఇక్క పైసా మీది ఉన్నదా ? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా ? అని అడిగారు. 24 గంటలు ఫ్రీ కరెంట్, రైతు బంధు, బీమా, కల్లాలు కట్టిస్తాఅంటున్నారు కేసిఆర్. బాయిల కాడ మీటర్లు, విదేశీ మక్కలు తెచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నరు బీజేపీ వాళ్ళు. దొంగ రాత్రి కరెంటు ఇచ్చి రైతుల ఉసురు తీసింది పార్టీ కాంగ్రెస్. 2500 కోట్లు ఇస్తా మీటర్లు పెట్టలన్నాడు మోడీ.. పక్క రాష్ట్రం ఏపీ లో 4000 కోట్లు తెచ్చుకుని మీటర్లు పెడుతున్నాడు. నీ 2500 కోట్లు వద్దు నీ మీటర్లు వద్దు.. మా రైతుల సంక్షేమమే మాకు ముఖ్యమని మోడీ కి లేఖ రాసిండు కేసీఆర్ అని తెలిపాడు. కాంగ్రెస్ కరెంటు ఇయ్యక చంపిండ్రు.. బిజెపి మీటర్లు పెట్టి చంపుతరట.. మందుబస్తాకు చెప్పులు లైన్ లో పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉండేది. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉండేది అని తెలిపారు.

Related posts