telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజశేఖర్ కు జోడిగా శ్రియ

Shriya

విలక్షణ చిత్రాల్లో నటిస్తూ, తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసిన రాజశేఖర్ ‘గరుడవేగ’తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రాజశేఖర్ చేసిన ‘కల్కి’ కలెక్షన్ల పరంగా నిరుత్సాహపరచగా, కాస్తంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్, ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమాను అప్పగించారు. వాస్తవానికి ఓ కన్నడ రీమేక్ లో నటించాలని, దానికి ‘సత్య’, ‘బేతాళుడు’ సినిమాల దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకపోవడంతో వీరభద్రం చౌదరికి లైన్ క్లియర్ అయింది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ సరసన దర్శకుడు శ్రియను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట. కాగా ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే చాన్స్ కొట్టేసిందన్న సంగతి తెలిసిందే.

Related posts