telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

నేడు స్థిరంగా బంగారం ధరలు..

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 52,460 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 48,090 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,120 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,940 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం వెండి ధర అదే దారిలో స్థిరంగా రూ.71,300 వద్ద నిలిచింది.

Related posts