దుబాయ్ లాటరీలు భారతీయులకు తగలడం పరిపాటిగా మారింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.28 కోట్ల లాటరీ తగిలింది. తాజాగా, అబుదాబిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సలామ్ షానవాజ్ (43)కి రూ.1.91 కోట్ల లాటరీ తగిలింది. షానవాజ్ ఇటీవల రూ.3800 పెట్టి ‘మాల్ మిలయనీర్’ లాటరీ టికెట్ కొన్నాడు.
ఈ లాటరీలో అతడికి రూ.1.91 కోట్లు వచ్చినట్టు నిర్వాహకులు షానవాజ్‌కు సమాచారం అందించారు. విషయం తెలిసి షానవాజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆ డబ్బులతో స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటానని పేర్కొన్నాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది: లక్ష్మణ్