telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గుంటూరు లో నైట్ కర్ఫ్యూ…

ఏపీ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా గుంటూరు సిటీలోనూ భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇవాళ ఏకంగా 475 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. గుంటూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అప్ర‌మ‌త్తం అవుతుంది.. గుంటూరు సిటీలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ లాంటి ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించారు.. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈ నెల 22 తేదీ నుంచి నగరంలో ఆంక్షలు ఉంటాయ‌ని.. ఉదయం 9 గంట‌ల‌ నుండి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపారాల‌కు అనుమ‌తి ఉంటుంద‌న్నారు మేయ‌ర్ మ‌నోహ‌ర్.. సాయంత్రం 6 గంటల త‌ర్వాత అన్నిర‌కాల వ్యాపారాలు మూసివేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇక‌, 25వ‌ తేదీ నుండి రాత్రి 7 గంట‌ల నుండి ఉదయం 5 గంట‌ల‌ వరుకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని.. 15 రోజులు పాటు నగరంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌న్నారు. అయితే, ఈ స‌మ‌యంలో.. మెడికల్, అత్యవసర స‌ర్వీసుల షాపులకు 24 గంటలు అనుమతి ఉంటుంద‌న్న మేయ‌ర్.. నగరంలోని ప్రజలు ప్రతీ ఒక్కరూ సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Related posts