telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హ‌త్యపై సినీ ప్రముఖుల స్పందన

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హ‌త్య కేసు ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశ‌మంత‌టా ఈ హ‌త్య‌పై విస్తృత చ‌ర్చ జ‌రుగుంది. ఈ విషాద సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సు క‌లచివేస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు దీనిపై త‌మ స్పంద‌న గ‌ట్టిగా వినిపిస్తున్నారు. సుధీర్ బాబు, మెహ‌రీన్, మహేష్ కోనేరు, అల్లరి న‌రేష్‌, మంచు మ‌నోజ్‌ త‌దిత‌రులు ప్రియాంక హ‌త్య త‌మ‌ని ఎంత‌గానో బాధించింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఆడ‌పిల్ల‌లు ఆప‌ద స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు పోలీసులు లేదా షీ టీమ్స్‌ని సంప్ర‌దించండి. మీ ప‌రిస‌రాల‌లో ఉన్న వ్య‌క్తుల ప్ర‌వ‌ర్త‌న‌లో ఏదైన తేడా అనిపిస్తే వెంటనే అక్క‌డి నుండి వెళ్లిపోండి. ఆప‌ద స‌మ‌యాల‌లో అజాగ్ర‌త్త‌గా ఉండ‌కండి అని వారు హిత‌వు ప‌లికారు. బాధితుల‌కి త్వ‌ర‌గా న్యాయం జరిగేలా చూడాలని కూడా వారు కోరుతున్నారు. ప్రియాంక ఆత్మ‌కి శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాము అంటూ సెల‌బ్రిటీలు ట్వీట్స్ చేశారు.

Related posts