telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి పేరు పేరు మార్పు..అసలు కార‌ణం ఇదేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య చిత్రాలుతో బిజీ బిజీగా ఉన్నారు. ‘గాడ్ ఫాదర్, బోళాశంక‌ర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

మలయాళ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్‌గా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమా కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు

 ఇదేంటిది కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ రారాజుగా వెలుగొందుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరు మార్చుకున్నారా? అంటే అవుననక తప్పడం లేదు మరి. ఇందుకు పక్కా ప్రూఫ్ కూడా దొరకడంతో చిరంజీవి పేరు మార్పుకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి? చిరంజీవి పేరు మార్చుకున్నారా? అయితే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం..

కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది.

ఈ వీడియో సరిగ్గా పరిశీలిస్తే.. ఇందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కనిపించింది. మెగా స్టార్ చిరంజీవి అనే పేరుకు బదులు మరో ‘E’ని యాడ్ చేసి Megastar Chiranjeeevi అని స్క్రీన్‌పై వచ్చింది.

దీంతో ఇది చూసిన వారంతా చిరంజీవి పేరు మార్చుకున్నార‌ని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

Related posts