telugu navyamedia
సినిమా వార్తలు

అక్షయ్ 11వ రికార్డు… 100 కోట్ల క్లబ్ లో “కేసరి”

Kesari
అక్షయ్ కుమార్ హీరోగా, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన “కేసరి” చిత్రం ఈనెల 21న విడుదలయ్యింది. ఈ సినిమా తొలి రోజునే 21 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూళ్ళను రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. మొదటి మూడు రోజుల్లో సినిమా దాదాపు రూ.50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. 7 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతవరకూ అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 11వ సినిమాగా “కేసరి” రికార్డులకెక్కింది. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా “కేసరి” సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం మరో విశేషం. 
“కేసరి” కథ విషయానికొస్తే…1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. 21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “కేసరి” సినిమాలో అక్కీ “హవల్దార్ ఇషార్ సింగ్” పాత్రలో నటించాడు. “కేసరి” అంటే అర్థం త్యాగానికి గుర్తు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగిన సినిమాలు కూడా లేకపోవడంతో “కేసరి” తన హవాను మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

Related posts