telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

నా జీవితంలో ఏదీ అంత తేలికగా రాలేదు: స్మైలీ సింగర్ సునీత

singer sunitha

నా జీవితంలో ఏదీ కూడా తనకు అంత తేలికగా రాలేదని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 4న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఓ మ్యూజికల్ షోను ఆమె నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చిన్న వయసులోనే తన సినీ సింగర్ గా కెరీర్ ప్రారంభమైందని, క్రమక్రమంగా తనంతట తాను కష్టపడి నేర్చుకున్నానని చెప్పారు.

సినిమాల్లో పాడే అవకాశాలు తనకు సులువుగానే వచ్చినా, ఆ అవకాశాలను నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే అయిందని అన్నారు. అంత కష్టపడి నేర్చుకున్నాను కనుకనే ఇప్పటికీ తాను నిలబడగలిగానని చెప్పారు. ఇప్పటికీ తన కెరీర్ కొనసాగుతోందని అనుకుంటున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమలోకి తాను వచ్చిన కొత్తల్లో అందరినీ నమ్మేసేదానినని, ఇప్పుడు, ఏది నమ్మాలో? ఏది నమ్మకూడదో తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

Related posts