telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

చంద్రయాన్-2 కి .. కౌంట్ డౌన్ ప్రారంభం…

ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 6.43 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని వాహకనౌక జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం1 నింగిలోకి తీసుకెళ్లనుంది.

చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేపట్టనున్న ‘చంద్రయాన్-2’ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం షార్ నుంచి రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు పౌరుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Related posts