telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ నుండి లీకైన ఫోటో…

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకఫూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎప్పుడో రావాల్సిన వకీల్ సాబ్ సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావడంతో అందరు తమతమ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. కానీ పవన్ మాత్రం ఇంతవరకు సెట్ లో అడుగు పెట్టలేదు. పవన్ షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు హాజరవుతారా.. సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తారా తమ హీరోని స్రీన్ మీద ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరోనా కారణంగా సినిమా షూటింగ్ దాదాపు 7 నెలలుగా ఆగిపోయింది. తాజాగా పవన్ షూటింగ్ కు హాజరయ్యాడు. మళ్లీ పాత లుక్ లోకి వచ్చిన పవన్ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో వకీల్ సాబ్ సెట్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫొటోలో పవన్ నల్లకోటు ధరించి మీడియతో సీరియస్ గా మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Related posts