telugu navyamedia
వార్తలు సామాజిక

తరామతి బరదారి హోటల్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు

▪️హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ తరామతి బరదారి హోటల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు

▪️టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ

▪️తరామతి బరదారి హొటల్ లోకి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలియ తిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.

▪️హోటల్ లో బస చేసేందుకు వచ్చే పర్యాటకులకు సందర్శన కోసం అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అన్నారు.

▪️తరామతి బరదారి హోటల్ లో చిన్న పిల్లల ఆటల కోసం, ఇండోర్ స్టేడియం, స్విమింగ్ ఫుల్, రెస్టారెంట్ లో నాణ్యమైన ఆహారం అందిస్తూ, పర్యాటకుల కోసం అన్ని రకాల మౌళిక వసతుల అందుబాటులో ఉంచుతూ పర్యాటకుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు.

వీరితో సూపర్వైజర్స్ సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కళ్యాణ్ ప్రభు, మురళి, టూరిజం శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related posts