telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్లవ నామ సంవత్సరం

గత సంవత్సరాన చెందిన ఖేదంబు మరచి

నవ సంవత్సరాన మోదంబుతో

సర్వజనుల కలయికయే ఆమోదంబై

ప్లవనామ సంవత్సరమాగమించె

 

చిత్తమే పులకించె చైత్రంబులోన

వసంత ఋతువే హర్షించి

నవ లేత చిగుర్లతో ఆహ్వానించె

ప్లవ నామ సంవత్సమున్

 

ప్లవ నామ సంవత్సరం

ఆగమించెన్ ఇలలో

శోభాయ మాన కాంతులతో

బాలాదిత్యుడే ఉదయించె పూర్వాద్రిన

 

ప్రకృతి పులకించె నవ వన శోభతో

నవ యుగాది కులుకుతూ

ఆగమించె కోయిలమ్మ రాగాలతో

మావి చిగురు కొమ్మన పూసే హరితమై

 

నవ రాగాల హేళతో

సప్తస్వరముల మేళవించి

సరి క్రొత్త రాగముదయింపగా

చిత్తమే మోదంబునొందే నవ యుగాదితో

 

వసంతాగమనముతో హర్షంబు నొందిన

ప్రకృతి వెల్లువై విరబూసే విరులతో

లేలేత చిగుర్లనాస్వాదించి కోయిలమ్మ

సరి క్రొత్తగానమాలపించగా మది మోదంబు నొందె

 

 

Related posts