telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు చిత్రంలో రౌడీ హీరో ?

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇటీవలే “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కియారను వరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపిస్తాడట. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని టాలీవుడ్ టాక్. ‘మహర్షి’లో ‘అల్లరి’ నరేశ్ పాత్ర ఎలాగైతే కీలకంగా నిలచిందో… అలానే ‘మహేష్ 27’లో విజయ్ స్పెషల్ రోల్ కూడా సమ్ థింగ్ స్పెషల్‌గా ఉంటుందట. మహేష్ తో తనకున్న ప్రత్యేక అనుబంధం కారణంగానే ఈ పాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట విజయ్ దేవరకొండ. మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే లేదా జూన్ నెలలో ప్రారంభమవుతుందట. ఆపై శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి… 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. మరి… ‘మహర్షి’ తరువాత మహేష్, వంశీ కాంబోలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Related posts