telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారు… దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

Divyavani

బాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేగుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో అనూహ్యంగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా పలువురు స్టార్ హీరోయిన్లు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రియా చక్రవర్తి, కన్నడనాట హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేది ఆరేస్ అయిన విషయం. ఈ నేపథ్యంలో సినీ నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉందని, పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారని చెప్పారు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో గతంలో చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత – ఏర్పాటు’ అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం దిగజారే జనాలు సినీ రంగంలో ఉన్నారని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేమిటని ప్రశ్నించారు. సినీ రంగంలో కూడా డబ్బు ఉన్నవారిదే రాజ్యమని చెప్పారు. సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తన కూతురు చదువుకుంటున్న హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related posts