telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ బయోపిక్… ఫస్ట్ లుక్ విడుదల

Sushanth

గతనెల జూన్‌ 14న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సుశాంత్ మృతిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సుశాంత్ జీవితంపై ఓ సినిమా కూడా తీస్తున్నారు. నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుశాంత్ జీవితంపై సూసైడ్ ఆర్ మర్డర్ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించి రీసెంట్‌గా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాలీవుడ్‌లో నెలకొన్న పక్షపాతధోరణి, అపోహలను తొలగించేందుకు ఈ చిత్రం నిర్మిస్తున్నానని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ 15 నుండి ముంబై, పంజాబ్‌లలో 50 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ చిత్రంలో 10 మందికి సంబంధించిన కథలు ఉంటాయని, సుశాంత్ మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారి పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయన్నారు. మూడు గంటల పాటు ఉండనున్న ఈ సినిమాలో టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఎలా షైనింగ్ స్టార్ అయ్యాడు. అతని ప్రయాణం ఎలా సాగిందనే అంశాలని కూడా ఆసక్తికరంగా తెరకెక్కించనున్నారు. సుశాంత్‌ది ఆత్మహత్య అని కొందరు అంటుంటే.. మరికొందరు అతనిది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ జీవితంపై సినిమా వస్తుండటంతో దీనికోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts