ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలుశాఖల అధికారులపై మంత్రి పిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక పాలసీ అమలు విషయంలో అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానంలో క్షేత్రాస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి ఆగ్రహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.
కాంగ్రెస్ పై విసుగుతోనే బీజేపీకి ఓటు: కేసీఆర్