telugu navyamedia
క్రీడలు వార్తలు

నాకు ఆ అలవాటు అస్సలు లేదు : ఇషాన్

ఆడేది తొలి మ్యాచ్ అయినా.. చక్కని షాట్లతో అలరించాడు భారత యువ ఓపెనర్ ఇషాన్‌ కిషన్. లక్ష్య చేధనలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. ఆదిల్ రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీచేశాడు. ఏ బ్యాట్స్‌మన్‌ అయినా ఆ మార్క్ అందుకోగానే.. బ్యాట్‌ పైకి ఎత్తుతాడు. కానీ ఇషాన్‌ కిషన్ మొదటగా ఇవేమీ చేయలేదు. దీని పై ఇషా మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేరుకున్నానని నాకు తెలియదు. ఆ విషయాన్ని విరాట్ భాయ్ నాతో అన్న తర్వాతే తెలిసింది. అయితే 50 తర్వాత నాకు బ్యాట్‌ ఎత్తే అలవాటు లేదు. అయితే కోహ్లీ.. ‘బ్యాట్‌ ఎత్తి మైదానంలోని నలువైపులకు చూపెట్టు. ఇది నీ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌’ అని వెనకాల నుంచి అరిచాడు. ఆ తర్వాతే బ్యాట్‌ ఎత్తి చూపించా అన్నాడు. ఝార్ఖండ్‌కు చెందిన ఇషాన్‌ కిషన్‌ ఎడమచేతివాటం వికెట్‌కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా పరుగులు చేస్తున్నాడు.

Related posts