telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆ ఇద్దరినీ సరిపోల్చడం .. తగదు.. : కోచ్ శ్రీధర్

bowling coach sridhar on panth and saho

భారత ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ వికెట్‌ కీపర్లు రిషబ్‌ పంత్‌, వృద్దిమాన్‌ సాహాను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. గాయంతో జట్టుకు దూరమై తిరిగి స్థానం దక్కించుకున్న సాహా అద్భుతంగా కీపింగ్‌ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎన్నో క్లిష్టమైన క్యాచ్‌లను అందుకున్నాడు. సాహా గొప్ప వికెట్‌ కీపర్. అయితే సాహాను, పంత్‌ను పోల్చడం సరికాదు. వికెట్‌ కీపింగ్‌లో సాహా అనుభవజ్ఞుడు. పంత్‌ యువకుడు. ప్రస్తుతం సాహా.. భవిష్యత్‌లో పంత్‌. ఇద్దరూ గొప్ప వికెట్‌ కీపర్లే’ అని తెలిపారు. గత కొన్నేళ్లుగా టీమఇండియా ఫీల్డింగ్‌ గొప్పగా మెరుగైందని, ప్రత్యర్థి జట్ల సారథులు కూడా భారత ఫీల్డింగ్‌ను కొనియాడుతున్నారని ఆయన అన్నారు.

గత కొన్నేళ్లుగా టీమ్ఇండియా ఫీల్డింగ్‌ అద్భుతంగా మెరుగైందని శ్రీధర్ అభిప్రాయపడుతున్నాను. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్ల సారథులు భారత ఫీల్డింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌.. టీమ్‌ఇండియాను టాప్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాడు నదీమ్‌ మైండ్‌సెట్‌, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాం. జట్టుకు ఏమి కావాలి అనే ఆలోచన, ఫిట్‌నెస్ ఎంతో కీలకం. మైదానంలో జడేజా ఉండటం జట్టుకు స్పూర్తినిస్తుంది. మెరుపు వేగంతో కదులుతూ, అద్భుత విన్యాసాలతో అతడు ప్రత్యర్థులను కట్టడి చేస్తాడు. ఈ దశాబ్దంలో భారత్‌కు అతడే అత్యుత్తమ ఫీల్డర్‌. స్లిప్‌ స్థానాల్లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెడుతున్నాం. వచ్చే ఏడాది జరగునున్న టీ20 ప్రపంచకప్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్ అరుణ్‌తో పాటు ఫీల్డింగ్‌ కోచ్‌గా శ్రీధర్‌ మరోసారి ఎంపికైన సంగతి తెలిసిందే.

Related posts