telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మేమిద్దరం కొంచెం అటుఇటుగా కనిపిస్తాం”… తాప్సిపై మిథాలీ రాజ

Mithu

ప్ర‌స్తుతం సినిమా ఇండస్ట్రీలో హిందీ, తెలుగు, తమిళం… ఇలా భాషలతో సంబంధం లేకుండా ట్రెండ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల‌కి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు బయోపిక్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెట‌ర్ మిథాలీ రాజ్ జీవిత నేప‌థ్యంలో చిత్రం రూపొందుతుంది. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ ఇటీవ‌ల టీ 20ల‌కి గుడ్ బై చెప్పింది. 2018లో ఆమె జట్టు తరఫున కీలకంగా వ్యవహరించారు.ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు వ‌యాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో విడుదల చేశారు. ఈ సినిమాలో తాప్సీ ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పాత్ర పోషిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన మిథాలీరాజ్ మాట్లాడుతూ “మేమిద్దరం కొంచెం అటుఇటుగా కనిపిస్తాం. నేను ఎలా ఉన్నానో తాప్సీ కూడా అలానే ఉన్నారు. తాను పెట్టుకునే హ్యాట్ లాంటిదే తాప్సీ కూడా పెట్టుకున్నారు. నేను ఆట ఆడుతున్నప్పుడు కొన్ని కురులు ముందుకు పడుతుంటాయి. అటువంటి లుక్‌తోనే  పోస్టర్‌లో తాప్సీ కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమయ్యింది. ఇందుకోసం మేకర్స్‌కు రీసెర్చ్ చేసేందుకు రెండేళ్లు పట్టింది. తన సన్నిహితుల అభిప్రాయాలు తీసుకుని స్క్రిప్ట్ రూపొందించారు” అని తెలిపారు.

Related posts