telugu navyamedia
సినిమా వార్తలు

నిర్మాతల మండలి వివాదం… ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Vishal

తమిళ సినీ నిర్మాతల మండలిలో అవకతవకలు జరుగుతున్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమిళ ప్రభుత్వం నిర్మాతల మండలి కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించింది. నిర్మాతల మండలికి సంబంధించిన ప్రతీ వ్యవహారం ఆయన పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది. అయితే ఈ విషయంపై సంఘం అధ్యక్షుడు విశాల్ ప్రభుత్వం ప్రత్యేక అధికారి నియామకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి రవిచంద్రబాబ్బు మంగళవారం విచారణ చేపట్టారు. విశాల్ తరఫున హాజరైన న్యాయవాది, నిర్మాత రాధాకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక అధికారిని నియమించడం కరెక్ట్ కాదని, రాధాకృష్ణన్ సంఘంలో అవకతవకలు జరిగాయంటూ చేసిన ఆరోపణలలో నిజం లేదని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిని తొలగించాలని కోర్టుకు తమ వాదనలు విన్పించారు. వాదనలు విన్న కోర్టు నిర్మాతల మండలి సంఘానికి ప్రత్యేక అధికారి నియామకంపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related posts