telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో తమిళ స్టార్ విజయ్

rrr

‘బాహుబలి’ లాంటి భారీ పాన్ ఇండియా మూవీని ప్రారంభించినప్పుడు అది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని పెద్దగా ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ, తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో రాజమౌళి ఆ సినిమాకు విపరీతమైన ప్రమోషన్ కల్పించారు. సినిమాపై జాతీయ స్థాయిలో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఇప్పుడు RRR సినిమాకు సంబంధించి అదే ఫాలో అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ RRR. దీనికి ‘రౌద్రం రుధిరం రణం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసేందుకు అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి స్టార్లను తీసుకున్నారు. అయితే, ఇప్పుడు తమిళ మార్కెట్‌ గురించి రాజమౌళి ఆలోచిస్తున్నారట. అక్కడ తారక్, రామ్ చరణ్‌లకు పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి.. లోకల్ స్టార్ హీరోని రంగంలోకి దించాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోన్న టాక్‌ను బట్టి చూస్తే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ RRRలో నటించనున్నారని అంటున్నారు. ఆయనతో ఒక అతిథి పాత్రను రాజమౌళి చేయించబోతున్నారని టాక్. అయితే, ఈ అతిథి పాత్ర తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఉంటుందని.. ఆయా భాషల్లో అక్కడి స్టార్ హీరోలు నటించబోతున్నారని టాక్. ప్రస్తుతానికి అయితే ఇవి వదంతులు మాత్రమే. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.

Related posts