మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే నలబై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా ప్రభావం కారణంగా హోల్డ్‌లో పడింది. షూటింగ్‌ను ఎప్పుడు మొదలు పెట్టాలనే దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) దగ్గర పడుతోంది. మరి ఈ సందర్భంగా ‘ఆచార్య’ అభిమానుల కోసం గిఫ్ట్ ఇస్తారా? అని అంటే మాత్రం అవుననే టాక్ వినిపిస్తోంది. ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ లేదా చిన్నపాటి టీజర్‌ను విడుదల చేసేలా మెగా టీమ్ ప్లాన్ చేస్తుందంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.