హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్‌లో అప్పుడు పరిస్థితి దారుణంగా మారింది… ఎగువ నుంచి భారీ ఎత్తున వరద రావడంతో.. హిమాయత్ సాగర్, ఇతర చెరువుల నుంచి మూసీ నదికి వరద పోటెత్తింది. అయితే ఇప్పుడు ఆ వరద భాదిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బాధితులు ఎంతమంది, ఎంతమందికి పరిహారం అందింది అనే విషయాలపై సమావేశం జరిగింది. ఇప్పటి వరకు వరదలతో నష్టపోయిన 3.87లక్షల కుటుంబాలకు 387.90 కోట్లు పంపిణి చేశారని పేర్కొన్నారు. వరద ముంపుకు గురై, మిగిలిన అర్హత కలిగిన కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని మరలా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరద ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీ కోసం అవసరమైన షెడ్యూల్ ను రూపొందించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు జిహెచ్ఎంసి కమీషనర్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని ప్రభావిత కుటుంబాలకు వారి ఇంటి వద్దే నగదు సహాయ పంపిణిని చేపట్టాలని నిర్ణయించారు.
previous post
next post