telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఓటరు జాబితాలో తప్పులు సరిదిద్దు కోండి – హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసే లక్ష్యంగా ఓటరు లిస్ట్ లో గల తప్పులున్న చో నగర వాసులు సరిచేసుకోవాలనీ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు.

ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో, పేరు ఉన్నచో జాబితాలో తప్పులను గుర్తించేందుకు ECI Website https// votes.eci.gov.in ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ అప్ ను మీ మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని పరిశీలించి కున్న తర్వాతనే సవరణ చేసుకొనగలరు.

ఓటరు జాబితాలో ఈ క్రింది తప్పులు సరి చేసుకో గలరు.

* కుటుంబ సభ్యుల పేర్లు వివిధ పోలింగ్ స్టేషన్‌లలో ఉన్నచో

* మిస్ మ్యాచ్ ఫోటోలు (పురుషుల ఫోటో స్థానం లో స్త్రీల ఫోటో, వైస్ వెర్సెస్).

* ఓటరు జాబితాలో సక్రమంగా లేని ఫోటోలు (ఆధార్ కార్డ్, SSC సర్టిఫికేట్, రేషన్ కార్డ్‌, ఫోటో తలక్రిందులుగా, అస్పష్టంగా ఫోటోలు ఉండడం మొదలైనవి.)

* సరైన డోర్ నంబర్, చిరునామా, పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్, పుట్టిన తేదీ, కుటుంబ సభ్యుల రిలేషన్ (తల్లి, తండ్రి, భార్య, భర్త, కుమారుడు, కూతురు,) పేరు ఓటరు జాబితాలో తప్పులు ఉన్నచో

* ఓటర్ లిస్ట్ లో తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం

* మీ దగ్గర EPIC ఉన్నా కూడా మీ పేరు ప్రస్తుత ఓటరు జాబితాలో లేకుంటే వెంటనే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

* మీకు ఆధార్ నెంబర్ ను కూడా ఓటరు జాబితాలో ఫారం-6 బి ద్వారా అనుసంధానం చేసుకునే సౌకర్యం కలదు.

మీ నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో నమోదైన పక్షంలో
పైన సూచించిన అన్ని తప్పులున్నట్లు గమనించినట్లయితే మరోసారి https/voters.eci.gov.in వెబ్ సైట్ ద్వారా గానీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా సవరణ కోసం ఫారం 8 ద్వారా చేసుకొన గలరు. ఈ అవకాశాన్ని జాప్యం లేకుండా ఇప్పుడే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

 

Related posts