నేరం చేసిన వాడిని కస్టపడి పట్టుకున్న పోలీసులకు, వారికి సహకరించిన ప్రజలకు కూడా రక్షణ ఉందని చెప్పడానికి దేశంలో ఎటువంటి వ్యవస్థ లేదు. ఎందుకంటే, ఎంత పెద్ద నేరం చేసినా కూడా బెయిల్ అనే చక్కటి అవకాశంతో ఎంచక్కా కరుడుగట్టిన నేరస్తుడు కూడా రోడ్డుపై చక్కర్లు కొట్టొచ్చు. ఈ గ్యాప్ లో సాక్షులను హతమార్చొచ్చు.. ఇంత చక్కటి అవకాశం నేరస్తులకు ఇస్తున్నప్పుడు.. సాక్ష్యాలు బహుశా సీసీ కెమెరాలు తప్ప మరొకటి దొరకవు. ఇలాంటివాటికి చట్టాన్ని మార్చాలని, అప్పుడే నేరస్తులు సృష్టించబడరని నెరపరిశోధన నిపుణులు అంటున్నారు.
తాజాగా, కడప సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యాడు. గంగిరెడ్డిపై మూడు జిల్లాల్లో మొత్తం 26 కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా, 2012లో ఎర్రచందనం కేసులో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. వివిధ దేశాల్లో తలదాచుకున్నాడు. 2015లో దొంగ పాస్ పోర్టుతో మారిషస్ చేరుకున్నాడు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నిస్తుండగా అక్కడి పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గంగిరెడ్డిని భారత్ కు తీసుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు నాడు అలిపిరి ఘటన కేసులో గంగిరెడ్డి నిందితుడు.
ప్రజల జీవితాలతో “కేసీఆర్ అండ్ కో” ఆడుకుంటున్నారు: విజయశాంతి