telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సినియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్ లో కన్నుమూశారు.

కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యామ్నం చనిపోయారు. రాజకీయ నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృస్ణారావు జర్నలిజం ప్రస్తానం ఈనాడుతో మొదలై… ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ద న్యూ ఇండియన్ఎక్సెప్రెస్ లో సాగింది. సుధీర్ఘకాలం జర్నలిస్ట్ గా పని చేసిన కృష్ణారావు….. పలు సంచలనాత్మక వార్తలు రాశారు.

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ శ్రీ సి.హెచ్.వీ.ఎం కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సీఎం తెలిపారు.

నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం తెలిపారు.

Related posts