telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయప‌డుతున్నారు..అందుకే

తెలంగాణ‌లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ జోస్యం చెప్పారు.

బీజేపీ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరైన సినీ న‌టి ఖుష్బూ మీడియాతో మాట్లాడారు ..దేశంలో వారసత్వ రాజకీయాలు ఉండకూడదని నేత అన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి.. ఇక చాలని అన్నారు.

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టారని.. అవన్నీ చూస్తుంటే ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నట్లు అనిపిస్తోందని ఆమె చెప్పారు.

అలాగే మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులతో కలిసి ఖుష్బూ సందడి చేశారు. కళాకారులతో ఫొటోలుదిగి..వారితో కలిసి ఖుష్బూ కాసేపు దాండియా ఆడారు .

Related posts