telugu navyamedia
తెలంగాణ వార్తలు

గోషామహల్‌‌లోని హై టెన్షన్ : మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు

*గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌
*రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
*ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు
*41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన పోలీసులు
*నోటీసులు జారీ చేసిన షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్‌ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రాజాసింగ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

అంతకు ముందు ఇంట్లోనే ఉన్నానంటూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అది సోషల్ మిడియా, మెయిన్ మిడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఆ విడియో విడుదలైన కాసేపటికే ఆయన ఇంటికి పోలీసులు చేరుకొని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు ఈ రోజు ఉదయమే రాజాసింగ్‌కు 41(A) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 

మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో 505(2), 171, రెడ్‌విత్‌ 171 సెక్షన్లు , షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో 153(ఏ). 295 (ఏ), 504, 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.  24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్‌హాట్‌ పోలీసులు కోరారు.

 

Related posts