telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అకాల వర్షం.. అపార నష్టం.. ఐదుగురి మృతి

rain effect

తెలంగాణలో బుధవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరొకరు గోడకూలి మృతి చెందారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

నల్గొండ జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లిలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో గీతకార్మికుడు సత్తయ్య గౌడ్ (30) మృతి చెందాడు. వర్షం పడుతుండడంతో ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పేందుకు వెళ్లిన కురుమర్తికి చెందిన చెన్నబోయిన రాణి (30), కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన రైతు చిలువేరి సమ్మయ్య (55), పెద్దపల్లి జిల్లా మూలసాలలో గొర్రెల కాపరి అజయ్‌ పిడుగుపాటుకు గురై మృతి చెందారు. సుల్తానాబాద్‌ మండలం సుద్దాలలో గాలివానకు గోడకూలి భాగ్యమ్మ అనే మహిళ మృతిచెందింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ పంట నష్టం జరిగింది. పలు చోట్ల ధాన్యం కుప్పలు నీటమునిగాయి. చెన్నూర్ లో గాలివాన భీభ త్సానికి చెట్లు విరిగి రోడ్ల పై పడడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయమేర్పడింది.

Related posts