telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్ రేప్ కేసులో న‌లుగురుకు బెయిల్​పై విడుదల..

రాష్ర్ట‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైన‌ర్ బాలిక రేప్ కేసులో మైనర్లకు బెయిల్ మంజూరు అయ్యింది.  సైదాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌ నుంచి వారు విడుదలయ్యారు.

గతంలో రెండు సార్లు బెయిల్‌ కోసం పిటిషన్ వేయగా…జువెనైల్ కోర్ట్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఒక్కో మైనర్కు రూ.5 వేలు చొప్పున పూచీకత్తుతో పాటు, విచారణకు సహకరించాలని ఆదేశించింది. హైదరాబాద్ డీపీఓ ముందు ప్రతి నెలా హాజరు కావాలని మైనర్లకు జువైనల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మొదట జువెనైల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కుమారుడు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఇంకా హోంలోనే ఉన్నాడు. మరోవైపు ఇదే కేసులో నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్ బెయిల్‌ను కోర్టు నిరాకరించింది

మే28న జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు బాలురతో పాటు సాదుద్దీన్‌ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Related posts