telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మళ్ళీ తెరపైకి .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం..

joint andhrapradesh protest in telangana again

ఆంధ్రప్రదేశ్ 2014 కు ముందు ఉమ్మడిగా ఉన్న విషయం తెలిసిందే. అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడింది. దీనికోసం రాజకీయ పార్టీలే కాకుండా, ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి సంఘాలు బయటకు వచ్చి నినాదాలు చేశాయి. తమకు ప్రత్యేక తెలంగాణ కావాలని, తమ ఉద్యోగాలు తమకే కావాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు 2014లో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లు కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏం సాధించారు.. ఏంటి అన్నది వేరే విషయం. గడిచిన ఐదేళ్ళలో ఎంత అభివృద్ధి చెందింది ఏంటి అనే విషయాలు పక్కన పెడదాం. 2018 లో కెసిఆర్ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కెసిఆర్ తిరిగి విజయం సాధించారు. గతంలో కంటే మంచి మెజారిటీ ఇచ్చారు. 2019 లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 17 పార్లమెట్ స్థానాలకు గాను 16 గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేసింది తెరాస పార్టీ. కానీ, కేవలం ఆ పార్టీ గెలుచుకున్న స్థాయిలు 8 మాత్రమే కావడం విశేషం. దీంతో కెసిఆర్ పరపతి తగ్గిపోయిందా అనే డౌట్ ఏర్పడింది.

2019 ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కావడంతో అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చకచకా అమలు చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే జగన్ ఇక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాదు ప్రతి ఏడాది జనవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇక్కడి నుంచే తెలంగాణలో లొల్లి మొదలైంది. జగన్ ఏపిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు. ఏం తక్కువైంది అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అంతేకాదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాల ప్రస్తావన తీసుకురావడం లేదు. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో విద్యార్థి సంఘాలు చాల చోట్ల తెలంగాణ వద్దు.. ఉమ్మడి ఏపి ముద్దు అని బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. ఇదిలా జరిగితే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధ్యం కాకపోయినా తెలంగాణ లో ప్రభుత్వం మారే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts