ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇకపై నిద్ర లేని రాత్రులే గడుపుతారని బీఎస్‌పీ అధినేత మాజీ సీఎం మాయావతి అన్నారు. ఎస్పీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సందర్భంగా అఖిలేష్ యాదవ్‌తో కలిసి మాయావతి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబుతామని ఆమె అన్నారు. విద్వేషాలు సృష్టించడం ద్వారా ప్రజలు విడదీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రత్యామ్నాయం కోసం యూపీ ప్రజలు ఎదురుచూస్తున్నారనీ చెప్పారు.
అందుకే బీఎస్పీ- ఎస్పీ చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడ్డాయని మాయవతి అన్నారు. రెండు జాతీయ పార్టీలు యూపీ ప్రజలను మోసం చేశాయని పేర్కొన్నారు. అందుకే కొత్త రాజకీయ విప్లవానికి తాము నాంది పలికామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం తమ రెండు పార్టీలు కృషి చేస్తాయని పేర్కొన్నారు. మోదీ పాలనతో దేశ ప్రజలంతా విసుగు చెందారని.. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల్లో ఎన్డీయే ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు