telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగువారి దేశభక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన అల్లూరి: చంద్రబాబు

chandrababu gift on may day

స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు తెలుగువారి దేశభక్తిని ప్రపంచానికి చాటిచెప్పారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోజు అల్లూరి సీతారామరాాజు జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ గిరిజనుల హక్కుల కోసం అల్లూరి పోరాడారని పేర్కొన్నారు.

అల్లూరిచేసిన పోరాటం అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం అని వ్యాఖ్యానించారు. అల్లూరి ప్రాణత్యాగం తెలుగువారి దేశభక్తిని, పోరాట పటిమను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. ఆ అమరవీరుని పోరాట పటిమను ప్రపంచానికి చాటింది. చిరస్మరణీయుడు అల్లూరి సీతారామరాజు ఆ మహనీయుని చరిత్రను మననం చేసుకుందామని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts