నవరత్నాల పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు అనుగుణంగానే నిధుల కేటాయింపు ఉండాలని చెప్పారు. ఈ నెల 12న ప్రనవేశపెట్టనున్న బడ్జెట్ లో ఏయే రంగాలకు ఎంతెంత కేటాయింపులు చేయాలో ముఖ్యమంత్రి సూచించారు.
అలాగే పెన్షన్ల పెంపు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను ప్రకటించిన రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగుల వేతనాల పెంపు, ఒమ్మఒడి పథకం, గృహనిర్మాణం తదితర పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రాకూడదనీ, ఈ పథకాలకు అధికంగా నిధులు కేటాయించాలని సూచించారు.ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.