ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైందని విమర్శించారు. ప్రభుత్వం ఆదాయం దారుణంగా పడిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో రకరకాల మాఫియాలు సంపదను దోచుకుంటున్నాయని అన్నారు.
విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై ఆయన స్పందిస్తూ బాబుపై చెప్పులు, టమాటాలు విసిరింది విశాఖ వాసులు కాదని అన్నారు. ఈ ఘటనను ప్రతిఒక్కరూ ఖండించాలని అన్నారు. విశాఖలో వైసీపీ రౌడీయిజం చేయిస్తోందని ఆరోపించారు. దీని కారణంగా విశాఖలో పెట్టబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.
మంత్రి పదవి కావాలని అడగలేదు: ఎమ్మెల్యే రోజా