తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ కు ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.