telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖకు బయలుదేరనున్న చంద్రబాబు

chandrababu

విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అయిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 2 వేల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను, అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు ఆయన వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వైజాగ్ వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా చంద్రబాబు కేంద్ర హోంశాఖను కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు కేంద్ర హోంశాఖ అనుమతించింది.కాసేపట్లో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖకు చంద్రబాబు బయల్దేరనున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. అనంతరం బాధితులను పరామర్శిస్తారు.

Related posts