ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. అంతేకాదు బీఏసీలో అచ్చెన్నపై పలు మార్లు సీఎం జగన్ సెటైర్లు కూడా వేశారు. సభ ఆలస్యంపై ప్రశ్నించారు అచ్చెన్న…. గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామని సీఎం జగన్ బదులిచ్చారు. అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ సీఎం జగన్ కామెంట్ చేశారు. మమ్మల్ని టీవీల్లో చూపించడం లేదన్న అచ్చెన్నాయుడు… అరడుగుల ఆజానుబాహుడు కనిపించపోవడమేంటని సీఎం జగన్ సెటైర్ వేశారు. ఎస్సీ, ఎస్టీ దాడులపై చర్చ జరగాలన్న అచ్చెన్న.. దీనికి బదులుగా వైసీపీ ఎంపీ సురేష్ పై టీడీపీ చేసిన దాడి పైనేనా అని ప్రశ్నించారు సీఎం జగన్. కాగా.. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి అసెంబ్లీ సమావేశాలు. సభ ప్రారంభం కాగానే… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో సహా పలువురికి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టింది ప్రభుత్వం.
previous post
next post