2014 లో కాంగ్రెస్ పార్టీ లో చేరి సికింద్రాబాద్ ఎమ్మెల్యే గా గెలిచిన సినీ నటి జయసుధ పదవీ కాలం ముగిసిన తరువాత టీడీపీ కండువా కప్పుకున్నారు! రెండేళ్లు ఆ పార్టీ లో ఉండి వై ఎస్ ఆర్ సి పి లోకి వెళ్లారు! మూడేళ్లు అక్కడ కాలక్షేపం చేసి ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోనున్నారు! వచ్చే వారం అమిత్ షా హైదరాబాద్ పర్యటన లో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈసారి ముషీరాబాద్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.